Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రంలో కొత్తగా 10 రెవెన్యూ డివిజన్లు

రాష్ట్రంలో  కొత్తగా 10 రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇవాళ జీవోలు జారీ చేసింది. రంగారెడ్డి తూర్పు డివిజన్‌ను సరూర్‌నగర్ రెవిన్యూ డివిజన్‌గా మార్చింది. కొత్తగా ఏర్పడే  రెవిన్యూ డివిజన్‌లు ఇలా ఉన్నాయి..

అనంతపురం జిల్లాలో కల్యాణదుర్గం, కదిరి; రంగారెడ్డి జిల్లాలో మల్కాజ్‌గిరి, రాజేంద్రనగర్‌; నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, నాయుడుపేట; విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి; తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం;  నల్గొండ జిల్లాలో దేవరకొండ; గుంటూరు జిల్లాలో గురజాల. వీటికి సంబంధించి సర్కారు ఆయా జిల్లాలకు ప్రాథమిక ప్రకటన విడుదల చేసింది. 

More Telugu News